ఒక సినిమా విడుదలకు ముందు ఎడిటర్ పని తనం ఎంతో గొప్పగా ఉండాలి. అలా లేనట్లు అయితే కొన్ని సన్నివేశాలు సినిమాకు అవసరం లేకున్నా కూడా సినిమాలో ఉండే ప్రమాదం ఉంటుంది. అలాంటి సన్నివేశాల వల్ల సినిమా రన్ టైమ్ పెరుగుతుందే కానీ ఆ మూవీ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటి సమయంలో సినిమా విడుదల అయిన తరువాత మూవీ కి ఫ్లాప్ టాక్ రావడంతో అలాంటి సన్నివేశాలను తీసేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో సినిమా నిడివి ఎక్కువ కారణంగా నెగెటివ్ టాక్ రావడం , ఆ తర్వాత అందులో నుండి కొన్ని సన్నివేశాలను తీసివేయడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలా ఈ మధ్య కాలంలో సినిమాల విడుదల తర్వాత రన్ టైమ్ ను తగ్గించిన మూవీలు ఏవో తెలుసుకుందాం.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటించారు. వంశీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ రన్ టైమ్ భారీగా ఉందని అదే ఈ మూవీ కి మైనస్ అనే టాక్ వచ్చింది. దానితో వెంటనే చేరుకున్న మూవీ యూనిట్ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన కొంత రన్ టైమ్ ను తగ్గించింది.

భారతీయుడు 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక దానితో ఈ సినిమా రన్ టైమ్ ను ఈ మూవీ బృందం తగ్గించడానికి డిసైడ్ అయ్యింది. ఈ మూవీ నుండి 12 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగిస్తున్నట్లు బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇలా రీసెంట్ టైమ్ లో ఈ రెండు మూవీల యొక్క నిడివిని విడుదల తర్వాత మూవీ బృందాలు తగ్గించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: