ఇక అతడి అనారోగ్య సమస్య గురించి తెలిసి కూడా రాధికా మర్చంట్ అతడిని ప్రేమించి పెళ్లాడింది అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. తనలో బలహీనతను కూడా ఆమె ప్రేమించింది అంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే. ఇక తనకు అంత పెద్ద సమస్య ఉన్నా కానీ అనంత్ మెంటల్ స్టామినా గొప్పది కాబట్టి తట్టుకోగలిగాడు. అతడిని ట్రోల్ చేసి జోకులు వేసిన వారు నిజంగా కుంటివారు.. గుడ్డివారు. రాధిక మర్చంట్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ, అనంత్ ని పెళ్లాడాలనే నిర్ణయం వెనక ప్రేమ దాగి ఉందని మీకు తెలుసా? తన తండ్రి ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి అవసరమైన సమయం కేటాయిస్తారని, అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో చెబుతున్నప్పుడు ముఖేష్ అంబానీ ఎంత ఎమోషనల్ అయ్యారు అందరికీ తెలిసిందే.
అతనికున్న ఆస్తమా వలన అతనికి ఏసీ గాలి మాత్రమే కాదు, వాతావరణం చల్లబడినా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. కోట్లకు వారసుడు అయినా ఏనాడూ ఏసీ రూములలో నిద్ర పోడు.. ఆ అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. అందుకే అతని కార్లలో కూడా ఏసీ ఉండదు.. కానీ అతనికున్న మానసిక స్థైర్యం ముందు ఎవరైనా దిగదుడుపే. ఈ నేపథ్యంలోనే అరుదైన అనారోగ్య సమస్య కారణంగా అధిక బరువు పెరిగాడు. అతడు దాదాపు 206 కేజీల నుంచి 100 కేజీల బరువుకి తగ్గాడు. అనంతరం తన స్నేహితురాలు రాధికను వివాహం చేసుకున్నాడు. రెండు ప్రీవెడ్డింగుల అనంతరం జూన్ 12న రాధిక మర్చంట్ ని అనంత్ అంబానీ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం దాదాపు 5000 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.