ఎన్టీఆర్ నుంచి rrr తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. rrr తర్వాత అనౌన్స్ చేసిన ‘దేవర’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27 రానున్నట్టు ఇటీవల ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.విషయం ఏమిటంటే దేవర ప్రమోషన్స్ కోసం టీమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. హీరో ఎన్టీఆర్ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని ప్రమోట్ చేయడం కోసం అనేక ప్రాంతాల్లో పర్యటించనున్నారని, వీలైనంత ఎక్కువగా తమ మూవీని ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి చేరువ చేయాలనేది టీమ్ ఆలోచనట. ఇక రాబోయే రోజుల్లో దేవర కి సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో భారీ సెలబ్రేషన్స్ ఉండే అతికొద్ది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.అలాంటి ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత 'దేవర' రూపంలో అదిరిపోయే మాస్ బొమ్మ రాబోతుంది. అయితే రూరల్ లో ఈ సినిమాకి రీచ్ మామూలుగా లేదు. "కాదేది ప్రమోషన్స్ కి అనర్హం" అన్నట్టుగా ఈమధ్య మేకర్స్ సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్ కి తీసుకెళ్లడం కోసం విభిన్న దారులు ఎంచుకుంటున్నారు.ఇప్పుడు 'దేవర' కూడా అదే దారిలో పయనిస్తున్నాడు.

రూరల్ ఏరియాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్స్ పై దేవర పోస్టర్లను ముద్రించారు. మరి ఇది మేకర్స్ ఆలోచనో లేక తమ సేల్స్ పెంచుకోవడం ఆ చిప్స్ కంపెనీ చేసిన పనో తెలియదు కానీ.. 'దేవర'కి రూరల్ ఏరియాల్లో బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ జరుగుతోంది.పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే జరగాలి అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.  ఏ దారిలో చేస్తే దేవర పై అంచనాలు రెట్టింపు అవుతాయో అదేవిధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. అయితే దేవర ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో షార్ట్ అండ్ స్వీట్ గా చేస్తే కచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో డైరెక్టర్ గా ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఇదే అని అంటున్నారు. జాన్వీ కపూర్  దేవరతో సక్సెస్ సాధిస్తే కొన్నేళ్ల పాటు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: