టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు.బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నటవారసత్వాన్ని తీసుకుని.. ఎన్టీఆర్ తరువాత అంతటి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న  హీరో బాలకృష్ణ.. బాలకృష్ణ బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రితో పాటే కొన్ని సినిమాలు చేశారు.ఎన్టీఆర్ డైరెక్షన్ లో కూడా బాలయ్య సినిమాలు చేశారు. అంతే కాదు బాలకృష్ణను సోలో హీరోగా పరిచయం చేసింది కూడా పెద్దాయనే. వీరిద్దిరి కాంబోలో వచ్చిన అప్పటి సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. సీనియర్ ఎన్టీఆర్  దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర వాటిలో ఒకటి . ఇక ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా, సింగర్ గా, మల్టీ టాలెంట్ చూపిస్తున్న బాలయ్య బాబు.. వీటన్నిటికంటే ముందు ఈసినిమాకు కెమెరా డిపార్ట్ మెంట్ లో పనిచేశారట. ఎన్టీఆర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణ కు కెమెరా వర్క్ కూడా నేర్పించారట. బాలయ్యసినిమా అయిపోయేవరకూ.. అందులో మెలకువలు కూడా నేర్చుకున్నారట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మం గారి పాత్ర  పోషించగా అతని భక్తుడు అయిన సిద్ధప్ప పాత్రలో బాలకృష్ణ నటించాడు.  సిద్దప్ప ను ఒక రకంగా ఈసినిమాలో కథానాయకుడిగా చూపించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ఎన్నో ఇబ్బందులు మధ్య ఈ సినిమా విడుదలై  ప్రభంజనం  సృష్టించింది. సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే..  విడుదలై బారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో బండ్లు కట్టుకుని మరీ దూర ప్రాంతాలకు వెళ్లి జనాలు ఈసినిమాను చూశారు.
సినిమా తీసే విధానం నేర్చుకున్న బాలయ్య.. ఈసినిమాలో కొన్ని షాట్స్ కు  స్వయంగా బాలకృష్ణ కెమెరామెన్ గా పని చేసారట. అలా బాలకృష్ణ కెరీర్ లో కెమెరా మెన్ గా పనిచేసిన ఏకైక సినిమాగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర నిలిచిపోయింది. కాని ఈసినిమా తరువాత అది కంటీన్యూ చేయలేకపోయారు.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ఏజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు ధీటుగా బాలయ్య సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: