కమెడియన్ గా ఇండస్ట్రీలోకి మొదట ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రియదర్శి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా మల్లేశం, బలగం వంటి సినిమాలతో బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ప్రియదర్శి నటించిన డార్లింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ప్రమోషన్స్ విషయంలో కాస్త గట్టిగానే చూపించిన ఈ సినిమా థియేటర్లలో అభిమానులను ఎలా ఆకట్టుకుంది హిట్ అయిందా లేదా అనే విషయం ఇప్పుడు రివ్యూలో చూద్దాం.


కథ విషయానికి వస్తే:
ప్రియదర్శి (రాఘవ్) పాత్రలో నటించారు పెళ్లి చేసుకొని తన భార్యని హనీమూన్ కి ప్యారిస్ కు తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే పెరిగి పెద్దవారవుతాడు.. కానీ తల్లిదండ్రులు చూపించిన నందిని (అనన్య నాగళ్ళ) తో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతాడు కానీ ఈమె ప్రేమించిన వాడితో లేచిపోతుంది. దీంతో ఒక్కసారిగా రాఘవ్ పెళ్లి పెటాకులు అవుతుంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న సమయంలో సరిగ్గా ఆనంది (నభానటేష్ ) ఎంట్రీ ఇస్తుంది. పరిచయమైన ఆరు గంటలలో రాఘవ్ ఈమెను వివాహం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత రాఘవ జీవితం ఎలా మరుపు తిరిగింది ఏం జరిగిందన్నది మిగతా స్టోరీ.


స్లిప్ట్ అనే పర్సనాలిటీ ఒక అమ్మాయికి వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని డార్లింగ్ సినిమాలో చూపించారు డైరెక్టర్. సినిమా విడుదలకు ముందే ట్రైలర్లో తన కామెడీతో నభా నటేష్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందులో పెద్దగా దాపరికారులేవు కానీ ఫస్టాఫ్ అంతా హీరో తన పెళ్లి అనే ఒక ధ్యేయం  తోనే పెరగడం చూపించారు. ఆ తర్వాత తన జీవితంలోకి మరో వ్యక్తి రావడంతో ఊహించని పరిస్థితులలో తన జీవితం మలుపు తిరుగుతుంది. మధ్య మధ్యలో కామెడీ సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి ఇంటర్వెల్ వరకు పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా.


సెకండాఫ్ విషయానికి వస్తే తన భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఏర్పడింది అనే విషయం తెలుసుకోవడం కోసం రాఘవ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. స్టోరీ పరంగా బాగానే ఉన్న కానీ డైరెక్టర్ చాలా సార్లు స్క్రిప్ట్ తీయడంలో తడపడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్ లో కాస్త స్లిప్ట్ వర్కౌట్ కాలేదు కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషన్స్ సీన్స్ తో డార్లింగ్ సినిమా పరవాలేదు అనిపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: