లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటకు మరో రూపం ఆయన. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల సత్తా ఆయనకు ఉంది. ఇక ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ సినీ రంగంలో ప్రవేశించారు. శృతి హాసన్ దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. బిజీ హీరోయిన్‌గా ఆమె మారిపోయింది. అయితే ఆ స్థాయిలో కాకపోయినా అక్షర హాసన్ కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. అంది వచ్చిన సినీ అవకాశాలను ఆమె ఉపయోగించుకుంటోంది. ఇక ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ గురించి అక్షర కీలక వ్యాఖ్యలు చేసింది.
స్కూల్ డేస్‌లో ఓ అబ్బాయి తనను టీజ్ చేయడంపై అక్షర హాసన్‌కు బాగా కోపం వచ్చిందట. దీంతో అతడిని కొడతానని వెళ్లి తన అక్క శృతి హాసన్‌కు చెప్పిందట. అయితే అక్షరను శృతి హాసన్ అనునయించి, ఎప్పుడూ హింస జోలికి పోకూడదని హితవు పలికిందట. మరో వైపు అక్షర హాసన్‌ను గొడవ పడకుండా ఆపిన శృతి మాత్రం ఊరుకోలేదు. తన చెల్లి జోలికి వచ్చిన అబ్బాయి వద్దకు వెళ్లి లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. దీంతో ఈ విషయం తెలిసి అక్షర హాసన్ తొలుత అవాక్కైంది. అయితే తన పట్ల తన అక్కకు ఉన్న ప్రేమ తెలిసి ఆమె భావోద్వేగానికి గురైంది. ఇలాంటివి తమ స్కూల్ లైఫ్‌లో చాలా జరిగాయని అక్షర హాసన్ పేర్కొంది. అలా తనంటే తన అక్క శృతి హాసన్ ఎంతో కేరింగ్‌గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.