‘కల్కి 2898 ఏడీ’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కల్కి మూవీలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారు. అయితే కల్కి మూవీపై కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా అలాగే కల్కి కలెక్షన్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.దాంతో ‘కల్కి 2898 AD’ బృందం వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. వారిపై మూవీ టీం ఏకంగా రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసింది. పాన్ ఇండియా మూవీలకు మంచి రివ్యూలు వస్తే 500-1000 కోట్ల రూపాయలను చాలా సులువుగా సంపాదిస్తాయి. గత రెండేళ్లలో ‘కేజీఎఫ్ 2’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘జైలర్’,  ‘యానిమల్’ వంటి ఎన్నో మూవీలు ఏకంగా రూ.500-1000 కోట్ల బిజినెస్ చేశాయి. ఇంకా అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది.


అయితే, కోల్‌కతాకు చెందిన కొందరు విమర్శకులు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ కల్కి 2898 ఏడీ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బృందం కోర్టుకు వెళ్లింది. వీరిద్దరిపై ఏకంగా రూ.25 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇప్పటికే సుమిత్, రోహిత్‌లకు లీగల్ నోటీసులని కూడా పంపడం జరిగింది.ఇక ఈ సుమిత్‌, రోహిత్‌లు ‘సమోసా క్రిటిక్స్‌’గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ‘కల్కి 2898 AD’ కలెక్షన్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘కల్కి 2898 AD’ మూవీ కలెక్షన్స్ నకిలీవని చెప్పడానికి వీరు ఇద్దరూ కూడా సాక్షాలు సమర్పించాలి. ఇంకా అలాగే ఎంత వసూళ్లు చేసిందనేది కూడా చూపించాలి. దీంతో పాటు పరువు నష్టం కోసం 25 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇక కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని అశ్విని దత్ 600 కోట్లతో నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: