భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ భార్య అంచనాల నడుమ విడుదల అయింది. అయితే ఔట్‌డేటెడ్ స్టోరీ, బోరింగ్ నేరేషన్, ఏ సన్నివేశాలు ఆకట్టుకోకపోవడం వల్ల సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. లాభాల మాట అటు ఉంచి ఇప్పుడు ఎంత నష్టాలు వస్తాయో అని బయ్యర్లు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. జోక్ ఏంటంటే భారతీయుడు పార్ట్ 3 కూడా ఆల్రెడీ ప్రారంభమై మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్, పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది.

 దీనిని ఐదారు నెలల్లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేశారట. కానీ పార్ట్‌-2కి వచ్చిన రెస్పాన్స్ చూసి దానిని కొద్ది రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ ఈ సినిమాలో తన పాటు కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉంది దానికి నెలరోజుల పాటు సమయం పట్టునుంది. ఎలాగూ పార్ట్-2 ఎదురు తన్నింది కాబట్టి ఇప్పటికిప్పుడు దీన్ని పూర్తి చేయాల్సిన అర్జెంటు లేదని శంకర్ కూడా భావిస్తున్నాడట ఉన్న ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్ పెట్టేది సక్సెస్ అందుకోవడమే మంచిది అని కమల్‌ హాసన్ తో పాటు శంకర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కమల్‌ హాసన్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు.  ఈ రెండిటినీ భారతీయుడు 3 కంటే ముందే తీసుకురావాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ఫ్లాప్‌ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ బాగా భయపడుతున్నట్లు సమాచారం. ఏం చేంజెర్ సినిమా హిట్ అయితే భారతీయుడు 2 సినిమాకి ప్లస్ అవుతుందని కూడా అంటున్నారు మరి శంకర్ చేతిలోనే ఈ రెండు సినిమాల సక్సెస్ అనేది ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: