నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక నాని చేసిన గత రెండు సినిమాలు దసరా హాయ్ నాన్న  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఆగస్ట్ 29 వ తేదీన భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తరువాత దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరియు హిట్ 3 చిత్రాలు చేయనున్నారు హీరో నాని. అయితే భారీ బడ్జెట్ తో వచ్చిన దసరా సినిమా బ్లాక్

 బస్టర్ అందుకోవడం తోపాటు 2023లో బిగ్గెస్ట్ సినిమాలలో ఒకటిగా కూడా నిలిచింది. ఆ తర్వాత చేసిన హాయ్ నాన్న సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. వాటితో పాటు ఈ రెండు సినిమాలు సైమా  ఫిలింఫేర్ అవార్డులలో రికార్డ్ నామినేషన్లు దక్కించుకున్నాయి. అయితే సైమా అవార్డుల్లో హాయ్ నాన్నకు 10 నామినేషన్లు దక్కగా, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 9 విభాగాల్లో నామినేట్ అయింది. ఇక దసరా సినిమాకు సైమా అవార్డుల్లో 11 నామినేషన్లు దక్కగా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో 8 నామినేషన్లు వచ్చాయి. ఈ రెండు సినిమాలతో ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం కావడం విశేషం. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్నతో శౌర్యువ్ దర్శకులుగా పరిచయమయ్యారు.

 శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ ఇద్దరూ ఉత్తమ దర్శకుల విభాగంలో నామినేట్ అవ్వడం మరో విశేషం.  దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే, హాయ్ నాన్నాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలతో నామినేట్ అయ్యారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మేజర్ అవార్డుల్లో ఇన్ని నామినేషన్లు అందుకోవడం నాని సాధించిన అరుదైన రికార్డ్. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరోవైపు హిట్ 3 చిత్రం షూటింగ్ పై తాజాగా  క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.  కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ నిధి శెట్టి ఈ హిట్ 3 లో భాగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: