సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లలను చూసుకోవడానికి ఆయాలను నియమించుకుంటారు. వీరిని కేర్ టేకర్, నానీ అని అంటుంటారు. అయితే ఈ నానీల గురించి ఇతరులకు తెలియడం చాలా అరుదు. కానీ ఒక నాని మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆమె ఒకరికి కాదు, ఇద్దరికీ కాదు ఏకంగా ముగ్గురు సెలబ్రిటీల పిల్లలను టేక్ కేర్ చేసింది. ఒక ఆమె ఎవరో, ఆమె చూసుకున్న సెలబ్రిటీ కిడ్స్ ఎవరో తెలుసుకుందాం పదండి.
మెగా హీరో రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులకు క్లీంకారా జన్మించిన సంగతి తెలిసిందే. ఈ బిడ్డను టేక్ కేర్ చేసిన ఆమె పేరు లలితా డిసిల్వా. ఈమె బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్- కరీనాల కుమారుడు తైమూర్ అలీఖాన్‌కు కూడా హాయిగా పనిచేసింది. అయితే వీరికంటే ముందే ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీని ఆమె చిన్న అనే విషయం రీసెంట్ గా తెలిసింది. లలితా అనంత్ అంబానీ పెళ్లిలో హాజరయ్యారు. అనంత్‌తో చాలా చనువుగా కనిపించారు. సాదాసీదాగా ఉన్నా ఆమె అనంత్‌తో ఒక తల్లి లాగా మూవ్ కావడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
అంబానీ పెళ్లి ఫొటోల్లో ఆమె చాలా ప్రముఖ వ్యక్తిగగా కనిపించింది. లలిత ఒక వీడియోలో అనంత్ పెళ్లిలో తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతూ కూడా కనిపించింది. తాను లాలిస్తూ పెంచిన ఈ బిడ్డ ఇప్పుడు పెద్దయ్యి ఒక యువరాణి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూసి ఆమె ఎమోషనల్ అయ్యింది. అనంత్ అంబానీని చూసుకోవడంతోనే ఆమె బేబీ కేర్ ఉద్యోగాన్ని స్టార్ట్ చేసింది. అనంత్ అరుదైన ఫోటోని షేర్ చేస్తూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఈమె అంబానీ ఫ్యామిలీతోనే కాదు కరీనా- సైఫ్ అలీ ఖా మొదటి కుమారుడు తైమూర్‌తో రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉండేది ఇక రామ్ చరణ్ దంపతులు ఈమెకు నెలకు ఒక లక్షన్నర రూపాయలు జీతం ఇచ్చినట్లు సమాచారం.