తెలుగులో ఎన్నో రియాల్టీ షో లు ఉన్నాయి. కాకపోతే బిగ్ బాస్ కు మాత్రం రియాలిటీ షో లలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ షో నడుస్తున్న సమయంలో , పూర్తి అయిన సమయంలో అనేక విమర్శలు వచ్చినా కూడా ఈ షో కు అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ వస్తుంది. దానితో బిగ్ బాస్ బృందం వారు సంవత్సరానికి ఒక సీజన్ చొప్పున దాదాపుగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగు లో బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్ లను కంప్లీట్ చేసుకోగా , ఒక ఓ టి టి సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే పూర్తి అయిన 7 సీజన్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక 3 వ సీజన్ నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీసన్ లకి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ 8 వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. దానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఇంతలా నాగార్జున ఎందుకు బిగ్ బాస్ సీజన్ లకి హోస్ట్ గా వివరిస్తున్నాడు అనే విషయం లోకి వెళితే ... నాగార్జున కంటే కూడా బిగ్ బాస్ బృందమే ఆయనను హోస్ట్ గా కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం నాగార్జున ఇప్పటికే అనేక సీజన్ లకి హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన హోస్టింగ్ ను అనేక మంది ప్రజలు ఇష్టపడుతున్నారు. అలాగే ఆయన కాంటెస్టెంట్ లు తప్పులు చేసినప్పుడు ఎలా దండిస్తాడో ... మంచి చేసినప్పుడు అలాగే మెచ్చుకుంటాడు. ఆ స్వభావం కూడా జనాలకు నచ్చడంతో బిగ్ బాస్ బృందం ఆయననే కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: