గ‌త కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో పుష్ప-2 సినిమాకు సంబంధించిన గాసిప్సే నడుస్తున్నాయి. ఆగ‌స్టు 15నుంచి డిసెంబ‌రు 6కు ఈ చిత్రం వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ డేట్‌కు కూడా సినిమా రాక‌పోవ‌చ్చ‌ని.. రూమర్స్ వినబడుతున్నాయి. కారణం ఏమిటంటే.. షూటింగ్ స‌జావుగా సాగ‌కపోవ‌డ‌మే దానికి కారణం అని గుసగుసలు నడుస్తున్నాయి. అయితే ఆ గాసిప్స్ అంతవరకు ఆగలేదు.. హీరో అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌ధ్య విభేదాలు వలెనే బ‌న్నీ గ‌డ్డం తీసేసి ఫారిన్ టూర్‌కు వెళ్లిన‌ట్లు గ‌ట్టిగా రూమ‌ర్లు వస్తున్నాయి. దీంతో అల్లు ఆర్మీ సామాజిక మాద్య‌మాల్లో సుకుమార్‌పై విరుచుకు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో బ‌న్నీకి, సుకుమార్‌కు మ‌ధ్య విభేదాలేమీ లేవ‌ని.. పుష్ప‌-2 షూట్ ఆగింద‌నే వార్త‌ల్లో నిజం లేద‌ని ఆ చిత్ర వర్గం క్లారిఫికేష‌న్లు ఇచ్చినప్పటికీ సుకుమార్‌కు జ‌ర‌గాల్సిన డ్యామేజీ అయితే జ‌రిగిపోయిందని సమాచార. సుకుమార్ ఏమైనా క‌ళాఖండం తీస్తున్నాడా? ఇంత ఆల‌స్య‌మేంటి? ఎన్నిసార్లు షూట్ క్యాన్సిల్ చేస్తాడు? ఎందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ వాయిదా? అంటూ బ‌న్నీ ఫ్యాన్స్‌ సుకుమార్ పై విరుచుకు పడుతున్నారు. కాగా త‌న గురించి జ‌రిగిన నెగెటివ్ ప్ర‌చార‌మంతా చూసి సుకుమార్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు భోగట్టా. ఈ క్రమంలో అనవసరంగా పుష్ప సినిమా తీసానురా దేవుడా? అని తన అనుచరులు ముందు వాపోయినట్టు సమాచారం.

తాను వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌డానికే ట్రై చేస్తున్నానని, అనుకోని పరిస్థితుల వలెనే ఆగ‌స్టు 15 నుంచి సినిమాను వాయిదా పడిందని చెప్పుకొచ్చాడట. మరీ ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు, ఫ‌లితాల‌ టైంలో బ‌న్నీ మీద వ‌చ్చిన నెగెటివిటీ చూసి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే చాలా డ్యామేజ్ తప్పదని నిర్ణయించుకున్న నిర్మాత‌లే వాయిదాకు మొగ్గు చూపార‌ని.. కానీ నింద మాత్రం త‌నే మోస్తున్నాన‌ని.. పాపం చాలా బాధపడ్డాడట. ఈ నేపథ్యంలో బన్నీ ప‌నిగ‌ట్టుకుని తనపైన సామాజిక మాధ్య‌మాల్లో దుష్ప్ర‌చారం చేస్తున్న వారిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు సినిమా విడుదలకు ముందే డివైడ్ టాక్ తెచ్చి బన్నీని నష్టపరచాలని చూస్తున్నారని అన్నాడట!

మరింత సమాచారం తెలుసుకోండి: