తమిళ తంబీ, హీరో సూర్య గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన సినిమాలు తమిళంలో ఎంత బాగా ఆడుతాయో ఇక్కడ మన తెలుగులో కూడా అంతే బాగా ఆడుతాయి అనడంలో సందేహమే లేదు. ఇక్కడ కూడా ఓ సెటప్ ఆఫ్ పీపుల్ ఆయన సినిమాలను చూడడానికి చాలా ఇష్టపడతారు. సూర్య గత రెండేళ్లుగా కంగువా అనే సినిమా మీదే ఉన్నాడు. ఈ క్రమంలో తమిళ బాహుబలి అంటూ కంగువా సినిమాని కొంతమంది కీర్తిస్తున్నారు. విడుదల అయితేగానీ దాని పస తెలియదు. కాగా ఇటీవల ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. త్వరలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. అయితే రిలీజ్ డేట్ అనేది మాత్రం గత కొంతకాలంగా మారుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే సూర్య ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఈ పాన్ ఇండియా సినిమా తాజా డేట్ కైనా విడుదల అవుతుందా అనే చర్చ నడుస్తోంది. సూర్య మంచి హీరో అయినప్పటికీ ఆయనికి పాన్ ఇండియా హీరో అన్న ట్యాగ్ లేకపోవడం దురదృష్టకరం. అదే మన తెలుగులో అయితే ఓ ముగ్గురు నలుగురికి పాన్ ఇండియా స్థాయి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా సినిమా కోసం కలలు కంటున్న సూర్యకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందని తమిళ తంబీలు చాలా ఫీల్ అవుతున్నారట. ఇకపోతే సూర్యసినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కంగువా సమయంలోనే తనకు సూరారై పోట్రు తో సక్సెస్ ఇచ్చిన సుధ కొంగర తో ఒక సినిమాకు సూర్య ఒకే చెప్పినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ఇలా సూర్యాకి ఏదీ పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రముఖ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య 44 వ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. ఆ సినిమాకు సంబంధిచిన మాత్రం షూటింగ్‌ ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడ్‌ గా చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవలే కన్నడ స్టార్‌ దర్శకుడు నర్థన్‌ దర్శకత్వంలో సూర్య ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పడకి వినికిడి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా సూర్య చేసిన పాన్ ఇండియా సినిమా 'కంగువ' మాత్రం ఈసారి తప్పకుండా రిలీజ్ అవ్వాలని ఆశిద్దాము.

మరింత సమాచారం తెలుసుకోండి: