తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉన్నది.ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ డైరెక్టర్స్ లేదా సెలబ్రిటీలకు ఏదైనా ప్రత్యేక రోజున వారికి సంబంధించిన సినిమాని రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు.. అయితే గతంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకి భారీ లాభాలు రాబట్టిన చిత్రాలను 4K క్వాలిటీలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన మూడు చిత్రాలు ఈ ఏడాది రాబోతున్నాయి.. అందులో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కల్ట్ క్లాసికల్ హిట్టుగా మంచి పాపులారిటీ సంపాదించడమే కాకుండా మహేష్ బాబు సినీ కెరియర్ కు ప్లస్ అయ్యింది.



అలాగే రవితేజ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమా దాదాపుగా 18 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జులై 27న ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసి రవితేజ ఫ్యాన్స్ సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోని సాంగ్స్ కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బ్రహ్మానందం రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి..అలాగే తమిళంలో కార్తీ నటించిన సిరుతైగా, కన్నడలో సుదీప్ వీర మదకరిగా , అలాగే అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోడ్ ఇలా అనేక భాషలలో ఈ చిత్రాన్ని రీమిక్స్ చేశారట.


రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అనుష్క ఇందులో విభిన్నమైన పాత్రలో నటించి మరొకసారి ప్రేక్షకులను మెప్పించింది. అనుష్క రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటికి రవితేజ హీరోగా అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: