ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి సీక్వెల్ సినిమాలతోనే దర్శక నిర్మాతలు అందరూ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి ఇక భారీగా లాభాలు పొందుతూ ఉన్నారు. కానీ ఇటీవలే విడుదలైన ఒక ప్రతిష్టాత్మకమైన సీక్వెల్ మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే దాదాపు దశాబ్దన్నర కాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేశారు. అయితే ఈ సీక్వెల్ మూవీ మాత్రం అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.
మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో ఇక ఈ సినిమాకు మరో పార్ట్ చేయాలని అటు నిర్మతలు అనుకున్నారు. కానీ రెండో పార్ట్ ఫ్లాప్ తో ఇక మూడో పార్ట్ ఆగిపోతుంది అన్నది శంకర్ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. 2025 లో రిలీజ్ అవుతుందని డైరెక్టర్ శంకర్ చెప్పారు కానీ ఇక పార్ట్ 2 కి నెగెటివ్ టాక్ రావడంతో మూడో పార్ట్ పనులు ఆగిపోనున్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు ఒక టాక్ వైరల్ గా మారింది. అయితే రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ తనకు ఎంతో బాగా నచ్చింది అంటూ కమల్ హాసన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.