దానికి తోడు ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్.. ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఇక ఈ సినిమాపై మరింత అంచనాల పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఏకంగా 1000 కోట్ల వసూళ్ల మార్పులు కూడా దాటేసి ఎన్నో రికార్డులను కూడా చెరిపేసింది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులందరికీ మంత్రముగ్ధులు చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా సక్సెస్ తో అటు ప్రభాస్ అభిమానులు, ఇక లాభాలు పొందిన నిర్మాతలు, పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయిన నాగ్ అశ్విన్ అందరూ హ్యాపీగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో కల్కి మూవీలో కీలక పాత్రలో నటించిన ప్రభాస్ అమితాబ్లకు ఇటీవల లీగల్ నోటీసులు అందాయి. కల్కి లో ఏకంగా కల్కి భగవానుడు గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించారు అంటూ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ తో పాటు సినిమా యూనిట్ కి కల్కి దామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. తల్లి దీపిక కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ గ్రంథాలను వాడుకుని పురాణాలను తప్పుగా చూపించడం ఈ మధ్యకాలంలో ప్యాషన్ గా మారిపోయింది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.