ఈ మధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. ఇక కొంతకాలానికి చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుని వేరు పడటానికి సిద్ధమైపోతున్నారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఇలాంటి దారిలోనే ముందుకు సాగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకులు ప్రకటించి అందరిని షాక్ కి గురిచేస్తారు అనేది కూడా తెలియడం లేదు  ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల విడాకుల విషయం అయితే ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అభిమానులు కలలో కూడా ఊహించని సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్నారు  ఇలా చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్ట్నర్ తో రాజి పడకపోవడం.. అత్తింటి గొడవలు.. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని కొనసాగించడం.. పర్సనల్ లైఫ్ ని మెయింటైన్ చేయడం మొదలగు కారణాలతో ఇక ఎంతోమంది సినీ సెలబ్రిటీ జంటలు విడాకుల బాట పడుతున్నాయి అన్నది తెలుస్తుంది. కేవలం ఒక ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఎంతోమంది పెద్దపెద్ద సూపర్ స్టార్లు సైతం ఇలా విడాకులు తీసుకుని వేరుపడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం.  


 కొంతమంది ఇలా విడాకులు తీసుకుని మరో పెళ్లికి సిద్ధమవుతుంటే.. ఇంకొంతమంది మాత్రం వైవాహిక జీవితం నచ్చక ఒంటరిగానే ఉండిపోతున్నారు. ఇక టాలీవుడ్ విషయానికొస్తే చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కూడా విడాకులు తీసుకుని ఇప్పుడు మరో జీవితాన్ని గడుపుతున్నారు  అయితే విడాకుల గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలోనే చెప్పారంటే ఒక అభిమానులు ఒక డైలాగ్ ని వైరల్ చేస్తున్నారు. ఆరెంజ్ సినిమాలో ప్రేమ ఎక్కువ కాలం ఉండదని.. తక్కువ రోజులు మాత్రమే బాగుంటుందని రామ్ చరణ్ చెప్పాడు. అయితే అప్పట్లో ఈ డైలాగ్ ఎవరికీ కనెక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి అప్పుడు రామ్ చరణ్ చెప్పింది నిజమే అంటూ కామెంట్ చేస్తున్నారు ఎంతోమంది నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: