భారతదేశ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "పుష్ప: ది రూల్" 2024 డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులలో అసూయను కలిగించిందట. వీళ్లు క్రియేట్ చేసిన తప్పుడు పుకార్ల వల్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య చీలిక ఏర్పడిందని టాక్.
ఈ పుకార్లను ఎవరికి వారు సొంత ఇమేజినేషన్లతో క్రియేట్ చేశారని ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. వారి పని వల్ల సుక్కు, బన్నీ వర్క్ రిలేషన్‌షిప్ డ్యామేజ్ అయిందని అంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి "ఆర్య," "ఆర్య 2," రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ "పుష్ప: ది రైజ్" సినిమాలు తీశారు. ఈ సినిమాలు తీస్తున్న సమయంలో వారి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది.
వారికి ఒకరి పట్ల ఒకరికి మంచి అవగాహన ఉంది. క్రియేటివ్ ఐడియాస్, చేంజెస్ పూర్తిగా చర్చిస్తారు. పెద్ద విజయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ పీస్ ఫుల్ సొల్యూషన్స్ కనిపెడుతుంటారు. అల్లు అర్జున్ భారతదేశం అంతటా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా ఎదగడం వల్ల చాలామంది అతని పట్ల, అతని సినిమాల పట్ల అసూయ పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాపులారిటీ గరిష్ట స్థాయికి చేరుకుంది, ఒక్క సినిమాతో బన్నీకి వరల్డ్ వైడ్ రికగ్నేషన్ రావడం కొంతమంది తారలను ఆశ్చర్యపరిచింది. కొంతమంది తారలు ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు
"పుష్ప: ది రూల్" రిలీజ్ కి ముందు సమయాన్ని పుకార్లను సృష్టించేందుకు సద్వినియోగం చేసుకోవాలనుకుని వారు బాగా ప్రయత్నిస్తున్నారు. వారు తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు, కానీ ఈ వాదనలను మేకర్స్ త్వరగా తోసిపుచ్చింది. "ఈ చిత్రం షూటింగ్ ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి" అని రీసెంట్ రిపోర్ట్ తెలిపింది.