హలో అండి నేను మురారి నిర్మాత ఎస్ రామలింగేశ్వరరావు గారి నుంచి 55 లక్షలకు ఐదేళ్లపాటు తూర్పుగోదావరి జిల్లా మురారి సినిమా హక్కులను కొన్నాను.. మొదటి రన్ లోనే కోటి 30 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి.. ఒకవేళ కలెక్షన్ల పరంగా ప్రతిపాదన అయినట్లు అయితే సినిమా ప్లాప్ లేదా సూపర్ హిట్ అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోండి సార్ అంటూ తెలియజేశారు. మురారి సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఉంటారని తెలిపారు.
మహేష్ అభిమానులు అమితంగా ఇష్టపడే చిత్రాలలో మురారి సినిమా కూడా ఒకటి.. కొందరు వ్యక్తులు నెగటివ్ కామెంట్స్ చేసిన మనం సమయం పాటిస్తూ ఉండాలి అంటూ మరొక నెటిజన్ తెలిపారు.. వాళ్ల బతుకులు అవి మన సంస్కారం ఇది అంటూ వాళ్ళను క్షమించి వదిలేయండి ఎవరిని కించపరచద్దు అంటూ.. మనం సహనం కోల్పోతే వాళ్లు విజయం సాధించినట్లు అంటూ సమాధానం ఇచ్చారు.. ఇక అంతపురం సినీమా లో అసలేం గుర్తుకురాదు సాంగ్ సౌందర్య చీర రంగులు మార్పు బాగుందని మరొక నెటిజన్ ప్రస్తావించగా అది సినిమాలో కాదండి కేవలం టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు మాత్రమే ఎడిటర్ చేసిన మార్పులు అంటూ తెలియజేశారు కృష్ణవంశీ.