నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. అఖండ మూవీ కంటే ముందు అపజాయలను ఎదుర్కొన్న బాలకృష్ణమూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి మూవీ తోనూ , భగవంత్ కేసరి మూవీ ల తోను  విజయాలను అందుకున్నాడు. దానితో ఇప్పటికే వరసగా మూడు విజయాలను అందుకొని అద్భుతమైన జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి టైటిల్ ను మేకర్స్ ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు దానితో. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ బృందం వారు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కాకపోతే ఈమె హీరోయిన్ గా కాకుండా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయేది ఎవరు అనే విషయం ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ప్రగ్య జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇందులో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దానితో మరోసారి బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న సినిమాలో ఈ బ్యూటీ ని హీరోయిన్ గా మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk