స్టార్ హీరోలు నటించే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. దాని వల్ల మూవీ బృందాలు ఆ సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా వారి ప్రమేయం లేకుండా బయటకు వెళ్లడానికి పెద్దగా అంగీకరించారు. ఏవో ఒకటి , రెండు అప్డేట్ లు అప్పుడు ఇప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి అప్డేట్ల కోసం స్టార్ హీరోల అభిమానులు , మామూలు ప్రేక్షకులు కొంత మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అంచనాల మధ్య రూపొందుతున్న సినిమాలలో దేవర మూవీ ఒకటి.

ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండగా ... జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటించిన టెంపర్ వంశీ కూడా నటిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ నటుడు దేవర సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించాడు. తాజాగా ఈయన తన సోషల్ మీడియా అకౌంట్ లో దేవర కి నా డబ్బింగ్ పార్ట్ పూర్తి అయ్యింది అని తెలియజేశాడు. అలాగే దేవర 2 కి ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని కూడా అన్నారు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: