తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈయన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈయన వరస పెట్టి సినిమాలతో ప్రేక్షకుల పైకి దండయాత్ర చేస్తూనే వస్తున్నాడు. కానీ అందులో రెండు , మూడు సినిమాలు మినహాయిస్తే ఏవి కూడా విజయాలను అందుకోలేదు.

ఇక కొంత కాలం గ్యాప్ తర్వాత ఈయన "క" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ కి సుజిత్ , సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. దానితో ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులకి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏకంగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధం అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

అలా కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న "క" మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడినట్లు తెలిసిపోతుంది. మరి ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కిరణ్ మంచి విజయాన్ని అందుకున్నట్లు అయితే ఈ నటుడికి దేశ వ్యాప్తంగా భారీ గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ సినిమాతో కిరణ్ కి ఏ స్థాయి విజయం అందుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: