సక్సెస్ లో ఉన్నప్పుడు హీరోయిన్లకు డిమాండ్ పీక్స్ లో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఫేంలో ఉన్నంత కాలమే బాగా సంపాదించుకోని వెనకేసుకోవాలి అన్న రూల్ ప్రకారమే దాదాపు హీరోయిన్లు అందరూ కూడా పనిచేస్తారు.ఆరంభంలో హీరోయిన్ల కెరీర్ వేల నుంచి మొదలవుతుంది. ఆ తరువాత లక్షలకు, కోట్లకు పడగెత్తుతుంది. అలా కెరీర్ ప్రారంభించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందాల నటి త్రిష రెండు దశాబ్దాల నుంచి తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.కొంత కాలం నుంచి అమ్మడు ఫుల్ ఫాంలో ఉండటం వలన ఒక్కో సినిమాకి 6 నుంచి 10 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల విలువ 100కోట్లు. ప్రస్తుతం త్రిష చిరంజీవి, కమల్ హాసన్ సినిమాల్లో త్రిష నటిస్తోంది. ఇంకా కొన్ని కొత్త సినిమాలు కమిట్ అయింది. వాటి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అలాగే పూజాహెగ్డే కెరీర్ పీక్స్ లో ఉండగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ రేసులో వెనుకబడింది.తెలుగులో స్టార్ గా ఉన్నప్పుడు ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకూ డిమాండ్ చేసేది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో ఒక్కో సినిమా చొప్పున పని చేస్తోంది.పూజాహెగ్డే ఆస్తుల విలువ దాదాపు రూ.55 నుంచి రూ.60 కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. 


అలాగే కాజల్ అగర్వాల్ సుదీర్గ కాలంగా నటిగా కొనసాగుతోంది. ఈ బ్యూటీ మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో తీసుకుంటుంది. ఈమె ఆస్తుల విలువ రూ.60 నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటాయట. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ కొన్నాళ్ల నుంచి జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది.రష్మిక సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటోందట. ఆమె ఆస్తుల విలువ రూ.70 నుంచి రూ.80 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు రూ.3.5 కోట్ల దాకా తీసుకుంటుందట. ఆమె ఆస్తుల దాదాపు విలువ రూ.50 నుంచి రూ.55 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. ఇంకా అలాగే కీర్తి సురేష్  కెరీర్ ఆ మధ్య స్లో అయినా మళ్లీ స్పీడందుకుంది.

 ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశాలు కూడా అందుకుంటుంది.ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల దాకా తీసుకుంటుందని సమాచారం. ఆమె ఆస్తుల దాదాపు విలువ రూ.50 కోట్లకుపైగా ఉంటుందిట. ఇక నయనతార బాదుడు రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈమె డిమాండ్ చేయాలేగానీ ఎంతైనా ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఆమె 10 నుంచి 12 కోట్లు తీసుకుంటుందట.ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈమెకు ప్రయివేట్ జెట్ కూడా ఈమెకు ఉంది. సమంత 8 కోట్లు పారితోషికం తీసుకుంటుండగా, ఆమె ఆస్తుల విలువ 110 కోట్లు ఉందిట. ఇక అనుష్క శెట్టి 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఆస్తులు రూ.135 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తమన్నా సినిమాకు ప్రస్తుతం రూ.5 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.140 కోట్ల వరకు ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: