టాలీవుడ్ యంగ్ యాక్టర్ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ మూవీలో నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటిస్తుండగా ఆయనకు సోదరిగా లయ కనిపించనున్నారు. అలానే ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉన్నారని ఆ కీలక పాత్రలో వర్ష బొల్లమ్మ యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్‌ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ రాబిన్‌హుడ్‌, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు.తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటిల్‌తో నితిన్ రానున్నాడు.చిత్రసీమలో పవన్ కళ్యాణ్ అంటే నటి నటులకు , నిర్మాతలకు , దర్శకులకు ఇలా అందరికి ఎంతో అభిమానం..గౌరవం. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలనీ..నిర్మించాలని..చిన్న క్యారెక్టర్ లో ఆయనతో కలిసి నటించాలని ఇలా ఎంతో మంది కోరుకుంటారు.అలాగే పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే అగ్ర హీరోలు కూడా లేకపోలేదు. అలాంటి అభిమానుల్లో హీరో నితిన్  ఒకడు. తొలిప్రేమ సినిమా చూసి హీరో అవ్వాలని అనుకున్న నితిన్..అనుకున్నట్లే ఈరోజు హీరోగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పడిచస్తాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టకున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ ఫిలిం ‘తమ్ముడు’ నే తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు.ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ పాటని రీమిక్స్ చేయనున్నారని ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ఆ పాటేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 'తమ్ముడు'లో వయ్యారి భామ పాట చాలా పెద్ద హిట్. దాన్ని రీమిక్స్ చేస్తున్నారా..? లేక మరో సాంగ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: