టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్సేన్ ఎప్పుడు డిఫరెంట్ కద లను ఎంచుకుంటూ మంచి  క్రేజ్ సంపాదించుకున్నాడు. యాక్టర్ గా ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. ఇక ఇటీవల గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ ఈ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను

 తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన నటనతో మరోసారి అభిమానులను అలరించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ నెల 26న మెకానిక్ రాకీ సాంగ్ లేదా గ్లింప్స్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. అదే రోజు మీడియా మీట్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు. మెకానిక్ రాకీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉండటం ఈ సినిమాని బిజినెస్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే గ్లింప్స్ ని ప్రేక్షకుల

 ముందుకి తీసుకొని రాబోతున్నారని టాక్.  ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ మరో కీలక పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు.  దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు పోటీగా ఎలాంటి సినిమాలు వస్తాయా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, టాలీవుడ్‌లో ప్రస్తుతం దీపావళి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవీ కూడా లేవనే చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేశాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: