సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినా సెలబ్రిటీల్లో ఇనయా సుల్తానా ఒకరు. ఈ అమ్మడు తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకు. ఆ తర్వాత పలు షోస్ లో పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకున్న క్రేసుకు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ ను గౌతమ్ ను పరిచయం చేసి షాక్ ఇచ్చింది. అలాగే బాత్ రూమ్ లో ఫోటో షూట్స్ చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.


ఇక బాయ్ ఫ్రెండ్ తోనే ఒక ఇంట్లోనే కలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇనయా పేరు మార్మోగిపోతోందనడంలో అతిస్ శయోక్తి లేదు. ఇదిలా ఉంటే..తాజాగా, ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అసలు విషయంలోకి వెళితే..హైదరాబాద్లో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై పడిపోవటంతో చుట్టూ ఉన్న జనాలు సాయం చేయకపోగా గుడి గుడి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఇనాయా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ అతడికి సాయం చేయటంతో పాటు హాస్పటల్లో జాయిన్ చేశాడు. అంతేకాకుండా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.


ఇక ఇదే విషయాన్ని ఇనయా ఇన్ స్టా వేదికగా తెలపటంతో అంతా ఏమైంది ని ఆందోళన చెందుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ అమ్మడు క్లారిటీ ఇస్తూ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎమోషనల్ వీడియో చేసి నెట్ ఇంత షేర్ చేసింది. "నేను నిన్న పెట్టిన స్టోరీని చూసి చాలామంది ఏమయిందని నన్ను అడుగుతున్నారు. కానీ నాకేమీ కాలేదు. నేను గౌతం సేఫ్ గా ఉన్నాము. అయితే మేము వచ్చిటప్పుడు దారిలో ఓ యాక్సిడెంట్ జరిగింది. అది చూసిన చాలా పానిక్ అయ్యాను. కానీ గౌతం మెడికల్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి అతనికి సాయం చేశాడు. అక్కడ సిచువేష నేను హ్యాండిల్ చేశాడ అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: