నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ యువ హీరోలకు రూల్ మోడల్ గా నిలుస్తున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల విజయంతో జొష్ మీద ఉన్నాడు బాలయ్య. ఇక  ఇటీవల 109 సినిమాకి  సంబంధించిన లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అందులో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట బాబి. బాలయ్య కెరీర్ లో 109వ

 సినిమాగా ఇది వస్తుండగా సాలిడ్ హైప్ ఈ చిత్రంపై నెలకొంది. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ మూవీకి ముందు నుంచి టైటిల్ కూడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని సమాచారం.  కాగా ఈ

 సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక విడుదల అనుకోగా ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు బాలయ్య. దీంతో షూట్ వాయిదా పడుతూ వచ్చింది. అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇటీవల బాలయ్య షూటింగ్ లో అడుగు పెట్టారు. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు టాక్. అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ డేట్ కు వస్తే వారం గ్యాప్ లో అనగా 25న రానున్న శంకర్, రామ్ చరణ్గేమ్ ఛేంజర్ నుండి గట్టి పోటీ ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: