దిగవంత నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా అంత త్వరగా ఎవరో మర్చిపోలేరు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతేకాదు ఈ సినిమాకి ఎన్నో అవార్డులో సైతం వచ్చాయి.  జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం సైతం అందుకుంది ఇందులో సావిత్రి గారి పాత్రలో నటించిన కీర్తి సురేష్. ఇక ఇందులో సావిత్రి గారి పాత్రకి కీర్తి సురేష్ ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్

 పతాకాలపై ప్రియాంక దత్ నిర్మించారు. సి అశ్వనీదత్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సాయి మాధవ్ బుర్రా క్యామియో పాత్రలో నటించారు. అలాగే చిన్నప్పటి సావిత్రి, సుశీల పాత్రల్లో మెరిశారు ఇద్దరు చిన్నారులు. వారిలో సావిత్రి లాంటి బలమైన పాత్రను పోషించిన పాప గుర్తుందా.?.ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా.? ప్రముఖ స్టార్ హీరో, నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్

 మనవరాలు సాయి తేజశ్విని. దిగవంత నటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి  లో చిన్నప్పటి సావిత్రి పాత్రలో చాలా చక్కగా నటించింది సాయి తేజశ్విని. అరే సావిత్రి చిన్నప్పుడు ఇలాగే ఉండేదా?అని పించేలా ఎంతో సహజంగా నటించిందీ స్టార్ కిడ్. ఈ రిలీజై అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి. ఇప్పుడీ చిన్నారి మరింత క్యూట్ గా,బబ్లీగా మారిపోయింది. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర తదితర ల్లో నటించింది సాయి తేజస్విని. గతంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: