తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శరత్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. 1970లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించారు శరత్ బాబు.. వీటితోపాటు మలయాళం కన్నడ హిందీ వంటీ చిత్రాలలో కూడా నటించారు. దాదాపుగా తన కెరియర్లో 200 సినిమాలకు పైగా నటించారు. తెలుగులో కంటే తమిళంలోనే శరత్ బాబుకు ఎక్కువగా స్నేహితులు ఉండేవారట. తెలుగు నటుడు అయినా కూడా చెన్నైలోనే స్థిరపడిపోయారు.


ఇండస్ట్రీలో శరత్ బాబుకు మంచి స్నేహితుడు అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ముద్దు సినిమా మంచి విజయాన్ని అందుకున్నది.. శరత్ బాబు నటి రమప్రభాను 1971లో ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఈమె తెలుగు తమిళంలో పాటు మరికొన్ని భాషలలో 300కు పైగా చిత్రాలలో నటించింది. అయితే కొన్ని కారణాల చేత 1988లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు శరత్ బాబు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేగలతా దీక్షిత్ ల వివాహం చేసుకున్నారు.


వీరు 1990లో వివాహం చేసుకున్న 2011లో విడిపోవడం జరిగింది. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబుకు వారసుడు కూడా లేరట. శరత్ బాబు సెప్పిస్ వ్యాధితో బాధపడుతూ గత ఏడాది మే 22న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఒక్కసారిగా శరత్ బాబు ఆస్తుల గురించి వారు విషయాలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా శరత్ బాబుకు చెన్నై, బెంగళూరు , హైదరాబాద్ వంటి ప్రాంతాలలో కొన్ని కోట్లాది ఆస్తులు ఉన్నాయట.. వీటితోపాటు అపార్ట్మెంట్లు జిల్లాలు ఇతరత్రా కంపెనీలు మానస కూడా చాలానే ఉన్నాయట. అయితే శరత్ బాబుకు సంతానం లేకపోవడంతో ఈ ఆస్తి మొత్తం తన సోదరుల పిల్లలకు ఇవ్వాల్సి వచ్చిందట. శరత్ బాబు సోదరుడు .. మాట్లాడుతూ తామందరము కలిసే ఉంటాము. అతను ఆస్తిలో ఏదైనా ఉంచాడో లేదో మాకు తెలియదు.. అతడు ఏదైనా వీలునామా రాసి ఉంటే మాకు ఎలాంటి సంబంధం లేదు.. లేకపోతే ఆస్తులు మా కుటుంబ సభ్యులు అందరము పంచుకుంటాము ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదంటే అభిమానులకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: