అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న చైతు ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మత్స్యకారుల జీవన విధానం నేపథ్యంలో రాబోతోంది.ఇందులో చైకి జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. బన్నీవాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన

 నేపథ్యంలో సాగే ప్రేమ కథగా చందూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మత్స్యకార యువకుడిగా చైతన్య ఇందులో నటిస్తున్నారు.   ఇదిలా ఉంటే నాగ చైతన్య తో ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, హీరోయిన్ గా నటించింది. ఆ అమ్మడు ఎవరో తెలుసా.? ల్లో ఇలా జరగడం చాలా కామన్. ఓ లో హీరో పక్క న హీరోయిన్ గా నటించిన అవారే ఆతర్వాత అదే హీరోకు వదినగానో..లేక తల్లిగానో నటించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ చైతన్య తో కూడా ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్ గా చేసింది.  ఆమె లావణ్య త్రిపాఠి. ఈ బ్యూటీ

 కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన లో ఆయనకు భార్యగా నటించింది. ఆతర్వాత ఆ కు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు లో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే మనం లో వీరిద్దరూ స్నేహితులుగా నటించడం జరిగింది. మనం లో ఆమె చిన్న పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా యుద్ధం శరణం అనే లో చేశారు. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠీ అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించి మెప్పించింది. ఇదిలవుండగా తండేల్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌. అయితే తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిక్కారణం డిసెంబర్‌ క్యూలైన్‌లో భారీ చిత్రాలుండటమేనన్న టాక్‌ వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: