కార్తీకదీపం సీరియల్ కి సినిమాల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కార్తీకదీపం సీరియల్ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు వంటలక్క. అయితే ఈ సీరియల్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం వంటలక్క అలియాస్ దీప అని చెప్పొచ్చు.  అయితే  ఆ సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఇప్పుడు నడుస్తుంది. అయితే ప్రేమి విశ్వనాధ్ మలయాళం నటి అని, ఆమెకి పెళ్లయిందని అందరికి తెలుసు. ముఖ్యంగా ఈ సీరియల్ లో

 దీప పడుతున్న కష్టాలను చూసి టీవీలు చూస్తూనే కంట తడి పెట్టుకునేవారు కొందరు మహిళలు. అంతగా జనాదరణ పొందిన డైలీ సీరియల్ ఈ మధ్య కాలంలో ఏదీ లేదంటే అతి శకయోక్తి కాదు. దూరదర్శన్ లో రుతురాగాలు తర్వాత మళ్లీ అంతటి పేరు సంపాదించుకుంది కార్తీక దీపం. అయితే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర కన్నా కూడా దీప పాత్రకే బాగా గుర్తింపు వచ్చింది ఎక్కడికి వెళ్లినా ఆమె అసలు పేరు మర్చిపోయి దీపా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. కాగా ప్రేమి విశ్వనాధ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా

 మందికి పెద్దగా తెలియదు. ప్రేమీ విశ్వనాథ్ కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో లేవు. ఇటీవల ప్రేమీ విశ్వనాథ్ తన కొడుకుతో రీల్స్ చేసి షేర్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వంటలక్క కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా… అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీంతో ఆమె భర్త ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. ఈయన కేరళలలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017లో వరల్డ్స్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. ఇక ప్రేమీ విశ్వనాథ్ కొడుకు పేరు మనుజిత్. ఇతడు జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాడు. మనుజిత్ పక్కా హీరో మెటీరియల్. మంచి హైట్, శరీర ధారుడ్యం కలిగి ఉన్నాడు. మనుజిత్ త్వరలో హీరోగా లాంచ్ అయ్యే అవకాశం కలదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: