పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద ఇంకా సత్తా చాటుతోంది.జూన్ 27 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ జోరుగా కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజై మూడు వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఇంకా గట్టిగానే వస్తున్నాయి.ఇక 24వ రోజు అయిన శనివారం కూడా భారీగా కలెక్షన్స్ వచ్చాయి. గత రోజులతో పోలిస్తే.. 24వ రోజున ఏకంగా 110.34 శాతం వసూళ్లు పెరిగాయి. కల్కి సినిమాకు 24వ రోజున ఒక ఇండియాలో రూ. 6.1 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు నుంచి రూ. 1.7 కోట్లు, తమిళం నుంచి నాలుగు లక్షలు ఇంకా హిందీ నుంచి రూ. 3.6 కోట్లు, కర్ణాటక నుంచి కేవలం లక్ష, మలయాళం నుంచి మూడు లక్షల కలెక్షన్స్ వచ్చాయి.అలాగే 24 రోజుల్లో ఇండియాలో కల్కి 2898 ఏడీ సినిమాకు ఓవరాల్‌గా రూ. 608.45 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


వాటిలో నుంచి తెలుగు వెర్షన్ ద్వారా రూ. 274.3 కోట్లు రాగా హిందీ బెల్ట్ నుంచి రూ. 271.05 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంటే తెలుగు, హిందీ కలెక్షన్స్ దాదాపుగా సేమ్ వసూళ్లు ఉన్నాయి.ఇక తమిళ వెర్షన్‌కు రూ. 34.65 కోట్లు, కన్నడ నుంచి రూ. 5.36 కోట్లు ఇంకా మలయాళం నుంచి రూ. 23.09 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నార్త్ అమెరికాలో అయితే 24 రోజుల్లో కల్కి సినిమాకు ఏకంగా 18.2 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఆ వసూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.దాంతో నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన రెండో ఇండియన్ సినిమాగా కల్కి సినిమా మరో సూపర్ రికార్డ్ సాధించినట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. అలాగే కల్కికి సండేనాటికి అంటే నేటితో 25 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా 1100  కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. కాగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: