పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలలో "దేవర" కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో మాన్ ఆఫ్ మా సేస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పాట సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పాటతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. అయితే ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. దానితో  అభిమానులంతా ఈ సినిమా నుంచి విడుదలయ్యే  రెండు సాంగ్  కోసం ఎంతో

 ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో సెకండ్ సాంగ్ డ్యూయెట్ గా  ఉండనుంది అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై మరింత ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. ఇక పొతే ఈ పాట కూడా స్యూర్ షాట్ చార్ట్ బస్టర్ అట. అనిరుద్ సాలిడ్ ట్యూన్ ని అందిస్తే కొరటాల విజువల్ గా ఊహించిన ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వి కపూర్ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్ ఓవర్ గా చెప్పాలంటే మరొక సాలిడ్

 హీట్ లోడింగ్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్ ఇండియా హిట్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటించిన పాత్రకి ఆ అభిమానులంతా ఫిదా అయిపోయారు. కాగా ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో తెర మీదకి వస్తుండడంతో అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: