నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఈయన తాజాగా కొల్లి బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆల్రెడీ ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ కాస్ట్ ఉన్నట్టుగా ఫిక్స్ అయింది. ఇందులో బాలీవుడ్ నటి ఊర్వసి రౌటేలా, బాబి డియోల్ పలు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాలో అసలైన హీరోయిన్ ఎవరు

 అనే దానిపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే గతంలో ఈ మూవీలో యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కాగా దీనిపై అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలెనప్పటికీ కూడా ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే. ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు బాలయ్య నటిస్తున్న 109 సినిమాలోనే కాకుండా ఈయన చేయబోయే నెక్స్ట్ 110 సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై మరింత అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా బాలయ్య

 నటించబోయే నెస్ట్ ప్రాజెక్టులో తాను ఇప్పటివరకు నటించని డైరెక్టర్ తో కలిసి చేస్తాడా లేకపోతే బోయపాటి శ్రీను తో ఉంటుందా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా బాలయ్య ఇప్పటికే నటించిన అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించింది. కాబట్టి ఒకవేళ బాలయ్య నటించబోయే 110 అఖండ 2 సినిమా కూడా ప్రగ్యా జైస్వాల్ కనిపించే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే బాలయ్య కెరీర్ లోనే 109 సినిమాగా కొల్లి బాబీ దర్శకత్వం వహిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: