మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో విడుదలైంది. ఈ ఏడాది మార్చి 28న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. మొత్తం థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ షోకు సిద్ధమైంది.గురువారం నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయిన "ఆడు జీవితం"సినిమా తెలుగు ప్రేక్షకులను కదిలిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ నేపథ్యంలో కలిగిన కుటుంబాలు ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు.ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల కష్టాలను ఈ మూవీలో అద్భుతంగా చూపించారు.ఇప్పటికీ సౌదీలో చాలామంది భారతీయులు అలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ని షేక్ చేస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం చూడనివారుంటే మిస్ చేసుకోకండి.ఆడు జీవితం సినిమాలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం. ది గోట్‌డేస్ అనే న‌వ‌ల ఆధారంగా య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు బ్లెస్లీ ఈ మూవీని తెర‌కెక్కించాడు.90వ‌ దశకంలో జీవనోపాధి కోసం కేర‌ళ నుంచి గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు మూలం. ప్ర‌ముఖ రచయిత బెన్యామిన్ న‌జీబ్‌ న‌జీర్ లైఫ్‌లో జ‌రిగిన‌ ఘ‌ట‌న‌లను పుస్త‌కంగా తీసుకురాగా దాని ఆధారంగా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామా సినిమాను తెర‌కెక్కించారు. 2008లో ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం దాదాపు 16 ఏండ్ల పాటు షూటింగ్, ఇత‌ర కార్య‌క‌లాపాలు పూర్తి చేసుకుని 2024 మార్చి 28న విడుద‌లై ‘ది గోట్ లైఫ్’  అంత‌టా పాజిటివ్ టాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: