సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రాశి.. తర్వాత తెలుగుతో పాటు తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‘పెళ్లి పందిరి’ ‘గోకులంలో సీత’ ‘శుభాకాంక్షలు’ ‘మనసిచ్చి చూడు’ ‘ప్రేయసి రావే’ ‘స్నేహితులు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ పక్క ఇల్లాలి పాత్రలు చేస్తూనే మరోపక్క గ్లామర్ రోల్స్ కూడా చేస్తూ వచ్చింది రాశి.’స్నేహితులు’ సినిమాలో ఈమె ఇంటిమేట్ సీన్లో కూడా నటించింది… అటు తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన ‘పోస్ట్ మాన్’ చిత్రంలో ఓ సీన్ డిమాండ్ చేయడం వలన నగ్నంగా కూడా నటించింది.ఇప్పుడు సినిమాల్లో తల్లి పాత్రతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రాశీ. ఆ సినిమానే రాఘవ రెడ్డి.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక.. గిరిజా కల్యాణం, జానకి కలగనలేదు వంటి పాపులర్ సీరియల్స్‌లో సైతం నటించి ఆకట్టుకుంది.‘కల్కి’ మూవీ గురించి రాశి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో దుమ్ము దులిపేస్తుంది. కనీ వినీ ఎరుగని రీతిలో అదరగొట్టేస్తుంది. బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లను నమోదు చేస్తున్న ఈ సినిమా ఇప్పటికి రూ.1000 కోట్లు క్రాస్ చేసి రూ.1100 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.

ఇంతటి ఘన విజయం సాధించడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది.రెబల్ స్టార్ ప్రభాస్  స్టార్డమ్, నాగ్ అశ్విన్ స్టోరీ రైటింగ్ - డైరెక్షన్ స్కిల్స్ వల్ల ఈ ఫీట్ సాధ్యం అయ్యింది. దాంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆడియన్స్ తో పాటూ సినీ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. వీరిలో స్టార్ హీరోలు సైతం ఉన్నారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో అలనాటి అందాల తార, హీరోయిన్ రాశి సైతం చేరారు. ‘కల్కి’ మూవీ గురించి రాశి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాశి.. కల్కి చిత్రాన్ని తన కుటుంబంతో కలిసి చూశానని, చాలా థ్రిల్ అయినట్లు చెప్పింది. “నేను, మా వారు, మా పాప కలసి ‘కల్కి’ మూవీ చూశాం. మా పాప అయితే 3D గ్లాసెస్ తో బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలకు ఈ మూవీ చాలా నచ్చుతుంది” అని తెలిపింది.అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ.. “భైరవ పాత్రలో నాగ్ అశ్విన్ ప్రభాస్ ను చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు” అని అభినందించింది.అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల నటన కూడా చాలా బాగుందని.. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ లాగా నిలిచాడని, కమల్ హాసన్ విచిత్రమైన గెటప్ లో చాలా ఆకట్టుకున్నాడు” అంటూ చెప్పింది. దీంతో రాశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: