మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఎస్ జే సూర్య ఈ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చరణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.

మరో 10 , 15 రోజుల షూటింగ్ తో ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. దానితో ఈ సినిమా విడుదల తేదీ పై అనేక వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ధనుష్ హీరోగా మరియు దర్శకత్వంలో రూపొందిన రాయన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

అందులో భాగంగా ఆ ఈవెంట్ కు విచ్చేసిన ప్రేక్షకులు గేమ్ చేంజర్ విడుదల అప్డేట్ ఇవ్వండి అని గట్టిగా అరవడంతో ఆయన గేమ్ చేంజర్ విడుదల గురించేనా అడుగుతున్నారు. అయితే క్రిస్మస్ పండక్కి కలుద్దాం అని చెప్పాడు. దీనితో ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి మూవీ బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా కొన్ని సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ అప్డేట్ టెన్షన్ పెట్టే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: