మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని వంశీ , ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను వచ్చే నెల అనగా ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా చిరు కెరీర్ లో 156 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత చిరు ఇప్పటి వరకు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

దానితో చిరు తన నెక్స్ట్ మూవీ ని ఆ దర్శకుడితో చేయబోతున్నాడు ... ఈ దర్శకుడితో చేయబోతున్నాడు అని అనేక వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో దర్శకుడి పేరు తెర పైకి వచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత కబీర్ సింగ్ , యానిమల్ మూవీలతో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ , చిరు హీరోగా ఓ మూవీ చేయబోతున్నట్లు అది "మెగా 157" గా రూపొందినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: