కీర్తి సురేష్ పెద్దగా పరిచయం అవసరం లేని ఈ అమ్మడు మలయాళం నుంచి తెలుగు ఆ తర్వాత తమిళ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాల్లో చాలా వరకు సహజత్వానికి దగ్గరగా ఉండేవే ఉంటాయి. తెలుగులో ఏమో కానీ కోలీవుడ్ లో కీర్తి సురేష్ కి తగిన పాత్రలు వచ్చాయని చెప్పొచ్చు. అఫ్కోర్స్ తెలుగులో చేసిన మహానటితోనే అమ్మడు నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుందనుకోండి. కానీ కీర్తికి వెరైటీ పాత్రలు తమిళ పరిశ్రమ నుంచి వస్తున్నాయి.

లేటెస్ట్ గా అలాంటి ఒక సినిమానే చేసింది కీర్తి సురేష్. రఘుతాత అనే సినిమాతో అమ్మడు వస్తుంది. ఇది కమర్షియల్ సినిమా కాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా కీర్తి సురేష్సినిమా ఈవెంట్ కు వేసుకొచ్చిన డ్రెస్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడు వెనక వీపు భాగం మొత్తం కనిపించేలా వెరైటీ శారీ కట్టుకొచ్చింది. డిజైన్ బాగున్నా ఎందుకో కీర్తి ఈ లుక్ లో డిఫరెంట్ గా అనిపించింది.

ఇక ఆమె మీద కెమెరా కళ్లన్ని ఉండగా పొద్దస్తమానం అమ్మడు సర్ధుకోవడమే సరిపోయింది. మరి ఈవెంట్ కు అలాంటి డ్రెస్ వేసుకుని రావడం ఎందుకు ఇలా ఇబ్బంది పడటం ఎందుకని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రఘుతాత ఈవెంట్ కి అమ్మడు వేసుకొచ్చిన శారీ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ వెళ్లాక కీర్తి సురేష్ లో పూర్తిగా మార్పు వచ్చిందని అంటున్నారు. అక్కడ బేబీ జాన్ సినిమా చేసిన కీర్తి సురేష్సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక తెలుగులో లాస్ట్ ఇయర్ దసరా చేసిన కీర్తి సురేష్ మరో ఆఫర్ అందుకోలేదు. ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్టు చెబుతున్నారు కీర్తి సురేష్ టీం.

మరింత సమాచారం తెలుసుకోండి: