భోళా శంకర్ తర్వాత చిరు చేస్తున్న సినిమా విశ్వంభర. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అయ్యాడు. బింబిసారతో సత్తా చాటిన డైరెక్టర్ వశిష్ట మల్లిడి విశ్వంభర దర్శకత్వం తో మరో సూపర్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మరో నా సామి రంగ హీరోయిన్ ఆషికా రంగనాథన్ కూడా భాగం అవుతుంది.

విశ్వంభర సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ని తీసుకున్నారు. సినిమా లో సగం బడ్జెట్ ఈ కాస్టింగ్ రెమ్యూనరేషన్ కోసమే అనేలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు పూనకాలు రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు.చిరు విశ్వంభరకు సంబందించి టాకీ పార్ట్ దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నట్టు చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఆగస్టు ఎండింగ్ లోగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ విశ్వంభరను 2025 సంక్రాంతి సీజన్ లో జనవరి 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.. విశ్వంభర మైథాలజీ కాన్సెప్ట్ తో వస్తుందట.. విశ్వంలో ఉన్న ఈ లోకాలన్ని చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. ఆడియన్స్ ను ఒక సరికొత్త ప్రపంచంలో కి తీసుకెళ్లేలా వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాతో మెగాస్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమా కు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా విశ్వంభర మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: