టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించగా , అందులో ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించలేదు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం తెలుగులోనే మాత్రమే కాకుండా ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇది ఇలా ఉంటే ఎస్ ఎస్ రాజమౌళి కొంత కాలం క్రితం ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అసలు ఆ ఇంటర్వ్యూ లో రాజమౌళి ఏం మాట్లాడాడు అనే వివరాలను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం రాజమౌళి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో ప్రసారం అయిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందులో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... సింహాద్రి సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అనేక థియేటర్లలో వంద రోజులు ఆడింది. దానిని అలాగే పబ్లిసిటీ చేశాం. కానీ ఆ తర్వాత మాత్రం కావలసికొని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడించి దానిని ప్రచారం చేశారు. నాకు అది పెద్దగా నచ్చలేదు.

అల్లు అరవింద్ తో మగధీర సినిమా స్టార్ట్ అయ్యే ముందు మనం ఇలా చేయకూడదు సార్ మనం ఎన్ని థియేటర్లలో సినిమా ఆడితే అన్ని థియేటర్లలోనే ఆడింది అని చెబుదాం అన్నాను. దానితో ఆయన కూడా ఓకే అన్నారు. ఇక సినిమా విడుదల అయింది. అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత ఆయన కూడా 100 రోజులు సెంటర్స్ విషయంలో తప్పు నెంబర్లను వేశారు. నేను ఫోన్ చేసి ఏంటి సార్ ఇలా చేశారు అన్నాను. నీకు తెలియనిది కాదు కదా రాజమౌళి. ఫ్యాన్స్ గొడవ ఎలా ఉంటుందో. అందుకే వేశాను తప్పుగా అనుకోకండి అన్నారు. అలా సినిమా బ్లాక్ బస్టర్ అయిన ఆ విషయంలో నాకు కోపం వచ్చింది అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: