సినిమా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వార్ అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంత మంది హీరోల మధ్య ఎక్కువ సార్లు బాక్స్ ఆఫీస్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. దానితో ఆ హీరోలకు సంబంధించిన అభిమానులు ఎవరు ఎక్కువ సార్లు ఆ పోరు లో పై చేయి సాధించారా అనే లెక్కలను వేస్తారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఓ ఆసక్తికరమైన బాక్స్ ఆఫీస్ వార్ జరగడానికి సిద్ధంగా ఉంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడడానికి రెడీ కావడంతో ఇందులో ఏ సినిమా పై చేయి సాధిస్తుందా అని ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే గతంలో రవితేజ హీరో గా రూపొందిన క్రాక్ , రామ్ పోతినేని హీరో గా రూపొందిన రెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డాయి. ఇందులో క్రాక్ సినిమా మంచి విజయం అందుకోగా , రెడ్ మూవీ యావరేజ్ మూవీ గా నిలిచింది. ఈ పోరులో రవితేజ పై చేయి సాధించాడు. మరి ఈ సారి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: