బిగ్ బాస్ షో తెలుగు బుల్లి తెరపైన ఎంతటి ప్రాచుర్యం పొందుందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అంతటి ఆదరణ లభించడంతో నిర్వాహకులు 7 షోలను గ్రాండ్ సక్సెస్ చేయగా త్వరలో బిగ్ బాస్ తెలుగు 8 ప్రోగ్రాముని ప్రేక్షలముందుకు త్వరలో తీసుకురానున్నారు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గత 3 నెలలుగా బిగ్ బాస్ 8పై అనేక రూమర్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు కథనాలు కోకొల్లలుగా వెలువడిన సంగతి మీరు వినే ఉంటారు. ఇక అందరి ఆసక్తిని తెరదించుతూ... ఫైనల్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విషయమై ఓ అధికారిక ప్రకటన వెలువడింది.

అవును, బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోని నాగార్జున స్వయంగా విడుదల చేయడం జరిగింది. నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇపుడు అది ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ... "మీకు తిరిగి టన్నుల కొలదీ వినోదం పంచేందుకు మేము వచ్చేశాము. బిగ్ బాస్ తెలుగు 8 లోగో గర్వంగా ప్రజెంట్ చేస్తున్నాము... ఇదిగో! అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఆస్వాదిచేందుకు మీరు సిద్ధమా?" అని నాగార్జున పేర్కొన్నారు. కాగా బిగ్ బాస్ తెలుగు 8 లోగో చూసినవారు చాలా కలర్ ఫుల్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్ 8ని ఇన్ఫినిటీ ని తలపించేలా డిజైన్ చేశారు. మధ్యలో ఒక పువ్వును మనం గమనించవచ్చు. లోగోలోనే మనకు అర్థం కానీ కొన్ని సంగతులు కూడా పొందుపరిచారు. అవి మెల్ల మెల్లగా బయటకు వస్తాయి.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే.. అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న లాంచింగ్ ఎపిసోడ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలో అని కేవలం లోగోతో కూడిన ప్రోమో మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జులై లో ప్రేమో వచ్చిందంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారం బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి ముహూర్తం పెట్టొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయంలో ప్రస్తుతం ఓ లిస్ట్ ప్రచారంలో ఉంది. కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి సురేఖావాణి, నటి హేమ, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, వేణు స్వామి, అంబటి రాయుడు, అమృత ప్రణయ్... బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: