తెలుగు , హిందీ సినీ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి మణులతో టబు ఒకరు. ఈమె ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం టబు తన ఫోకస్ ను ఎక్కువ శాతం హిందీ సినీ పరిశ్రమ పైనే పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికీ కూడా ఈమెకు అద్భుతమైన అవకాశాలు హిందీ సినీ పరిశ్రమలు దక్కుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈమెకు ఈమె "క్రూ" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈమెతో పాటు ఈ మూవీ లో కరీనా కపూర్ , కృతి సనన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.

ఈ ఇద్దరు హీరోయిన్లతో పోటీ పడి టబు కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి "ఔరో మే కహా దమ్‌ థా" అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. దానితో ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా 2002 లో వచ్చిన సాథియా మూవీ తర్వాత మీరెందుకు మళ్లీ షారుక్‌ ఖాన్‌ తో కలిసి నటించలేదు అనే ప్రశ్న టబు కు ఎదురయింది. దీనికి టబ్ అద్భుతమైన సమాధాన్ని ఇచ్చింది. షారుక్ ఖాన్ తో సాథియా మూవీ తర్వాత నటించకపోవడానికి గల కారణాలను ఈమె చెపుతూ ... నేను నిర్మాతనో , దర్శకుడినో ,  స్టోరీ రైటర్ నో కాదు.

షారుక్ తో సినిమా చేసే దర్శకుడో  , నిర్మాతో లేదా అతని కోసం స్టోరీ రాసే వ్యక్తులు అందులో హీరోయిన్ గా ఎవరు ఉండాలి అనే దానిని నిర్ణయిస్తారు. వారు అందులో నాకు ఒక పాత్రను రాసి వచ్చి నాకు చెప్పినట్లు అయితే అది నాకు నచ్చితే నేను సినిమా చేస్తాను. అలా నా దగ్గరికి ఎవరూ రాలేదు. సో ... షారుఖ్ తో సినిమా చేయకపోవడానికి నాకు ఎలాంటి కారణం లేదు. కాకపోతే మా కాంబోలో సినిమా వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మీరు షారుక్ తో సినిమా నటించాలి అని కోరుకుంటే అందుకు నేను సంతోషిస్తాను అని టబు తాజాగా సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: