మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు . ఇకపోతే రవితేజ ఇప్పటికి తాను నటించిన ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు . ఇకపోతే రవితేజ తన కెరీర్ లో ఎక్కువ శాతం పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.

ఈయన కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇందులో ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కిక్ మూవీ లో కాసేపే పోలీస్ పాత్రలో నటించిన అందులో సీరియస్ గా కాకుండా కామెడీగా నటించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. ఇకపోతే రవితేజకు ఆఖరుగా క్రాక్ అనే మూవీ తో విజయం దక్కింది. ఈ సినిమాలో కూడా రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇకపోతే రవితేజ "పవర్" అనే సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కూడా రవితేజ పోలీస్ పాత్రలో నటించాడు. ఇక రవితేజ పోలీస్ పాత్రలో నటించిన కొన్ని సినిమాలు అభజాయలను అందుకున్న ఎక్కువ శాతం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. ఆ మూవీ ల ద్వారా ఈయనకు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: