సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటులు తాము చేస్తున్న సినిమాలలో చిన్న సన్నివేశం పర్ఫెక్ట్ రాకపోయిన వచ్చేంతవరకు ఒళ్ళు హూనం చేసుకుంటూ ఉంటారు. అలా తాము నటిస్తున్న సినిమాలలో ఒక్క సన్నివేశం కోసం అత్యంత కష్టపడిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఇకపోతే ఈయన ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సినిమాలో ఓ టైటిల్ సాంగ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో సెల్ ఫోన్ పట్టుకొని బన్నీ ఒక స్టెప్ వేయవలసి ఉంటుంది. ఇకపోతే ఈ స్టెప్ కరెక్టుగా రావడం కోసం అల్లు అర్జున్ తన ఒళ్ళు హూనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క స్టెప్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 46 టేకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ డ్యాన్స్ స్టెప్ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ తన డేడికేషన్ తో ఈ సీను చేసినట్లు సమాచారం. ఇకపోతే మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa