టాలీవుడ్ లో హాట్ బ్యూటి గా పేరుపొందింది హీరోయిన్ హెగ్బా పటేల్.. మొదట కుమారి 21ఎఫ్ సినిమాతో తన అంద చందాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ముఖ్యంగా కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన మరికొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఇప్పటికి వరుస సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ముందుకు వెళ్తోంది హీరోయిన్ హెబ్బా పటేల్. ఇటీవల హనుమాన్ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో కూడా నటించింది. నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.



అలా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా అదే క్రేజ్ ని సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను సైతం హెబ్బా పటేల్ షేర్ చేసింది. హెబ్బా పటేల్ ఇంస్టాగ్రామ్ లో తన బుగ్గల మీద పసుపు రాసుకొని హల్దీ ఫంక్షన్లు మెరుస్తూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా  క్లూలెస్ అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. ఈ ఫోటోల పైన పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


దీంతో హెబ్బా పటేల్ అభిమానులు సైతం ఏంటి హెగ్బా అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. హెబ్బా పటేల్ తో పాటు మరి కొంతమంది ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 35 సంవత్సరాలు.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. మరి తన పెళ్లి వేడుకపై వస్తున్న వార్తలపై హెబ్బా పటేల్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: