‘పుష్ప 2’ ఆగష్టు 15 డేట్ నుండి తప్పుకోవడంతో ఆ డేట్ ను కార్నర్ చేయాలని అనేక మీడియం రేంజ్  చిన్న సినిమాలు పోటీ పడుతూ ఉండటంతో ఈ డేట్ కు విడుదల కాబోయే సినిమాల సంఖ్య పెరిగి పోవడం ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి ఈ సంవత్సరం ఆగష్టు 15 గురువారం రావడం ఆమరుసటిరోజు వరలక్ష్మీ వ్రతం ఆతరువాత శని ఆదివారాలు కలిసి రావడంతో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఏర్పడటంతో వరసపెట్టి వస్తున్న ఈ సెలవులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనేక సినిమాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.



ఈ ప్రయత్నాలలో భాగంగా ఇప్పుడు విడుదల కాబోతున్న సినిమాల సంఖ్య సుమారు 4 చేరుకోవడంతో ఇన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఈ పోటీలో ప్రధానంగా నిలుస్తోంది రామ్ పూరీ జగన్నాథ్ ల కలయికలో వస్తున్న ‘డబల్ ఇస్మార్ట్’ ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలు జనానికి బాగా నచ్చడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగాయి.



ఈ సినిమాకు పోటీగా వస్తున్న మిగతా సినిమాల లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నవీన్ నార్నె నటించిన ‘ఆయ్’ కూడ ఉంది. ఈ సినిమాలో వచ్చే వర్షం యాక్షన్ సీన్స్ కోసం నిర్మాత అల్లు అరవింద్ కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అని వస్తున్న వార్తలు మరింత షాకింగ్ గా మారాయి.  



ఈ రెండు మాత్రమే కాకుండా నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ’35 చిన్న కథ’ మూవీ కూడ ఒక డిఫరెంట్ సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పబ్లిసిటీని చాల డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈసినిమాలతో పాటుగా విక్రమ్ ‘తంగలాన్’ కూడ విడుదల అవుతూ ఉండటంతో ఇన్ని సినిమాలలో ఏసినిమా స్వాతంత్ర దినోత్సవ విజేతగా మారుతుంది అన్న ఆశక్తి  అందరి లోనూ  ఉంది..





మరింత సమాచారం తెలుసుకోండి: