దర్శకుడు పూరీ జగన్నాథ్ కు రవితేజాల మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో రవితేజా కు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ కూడ పూరీకి ఉంది. ఇలాంటి పరిస్థితులలో పూరీ కెరియర్ కు అత్యంత కీలకంగా మారిన డబల్ ఇస్మార్ట్ మూవీని టార్గెట్ చేస్తూ రవితేజ నటించిన ‘మిష్టర్ బచ్చన్ విడుదల అవుతూ ఉండటం పూరీ అభిమానులకు షాకింగ్ గా మారింది.



దీనికితోడు ఈ సినిమాకు సంబంధించి ఆగస్ట్ 14 సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్లు వేసేందుకు నిర్ణయం తీసుకోవడం కూడ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆగష్టు 15న అనేక సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఆ సినిమాల టాక్ కంటే తమ మూవీ టాక్ చాల ముందుగా ప్రేక్షకులకు చేరాలి అన్న వ్యూహాత్మక ఎత్తుగడ ఈ నిర్ణయంలో కనిపిస్తోంది అని అంటున్నారు.



ఈసినిమాను దర్శకుడు హరీష్ శంకర్ ‘రైడ్’ రీమేక్ గా తీస్తున్నప్పటికీ ఈ మూవీ కంటెంట్ లో చాల మార్పులు చేర్పులు చేశారు అన్న వార్తలు వస్తున్నాయి. రామ్ ‘డబల్ ఇస్మార్ట్’ విక్రమ్ ‘తంగలాన్’ ‘ఆయ్’ ‘35 చిన్న కథ’ లాంటి అనేక సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఫ్లాప్ లతో సతమతమైపోతున్న రవితేజా చేస్తున్న సాహసం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



వాస్తవానికి ఇండిపెండెన్స్ డేకు ఇన్ని సినిమాలు విడుదల కావడం టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అయితే ‘పుష్ప 2’ తన విడుదల తేదీ వాయిదా వేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల పై ఇన్ని సినిమాల దాడి జరుగుతోంది అనుకోవాలి. సంక్రాంతి దసరా సీజన్స్ లో ప్రేక్షకులు వీలైనంతవరకు విడుదలైన ప్రతి సినిమాను చూస్తూ ఉంటారు. అయితే కేవలం ఇండిపెండెన్స్ డే ని నమ్ముకుని ఇన్ని సినిమాలు ఏధైర్యంతో విడుదల అవుతున్నాయి అన్నది తలలు పండిన విశ్లేషకులకు అర్థం కావడంలేడు అన్నది అర్థం కావడంలేడు అని అంటున్నారు..  

 




మరింత సమాచారం తెలుసుకోండి: