టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు గురించి కూడా పరిచయం అవసరం లేదు. ఇక్కడ మాస్, క్లాస్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు మహేష్. హీరోగానే కాకుండా ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలబడడం ఆయన ప్రత్యేకత. ఈ క్రమంలో వందల మంది చిన్నారులకు గుండె చికిత్స చేయించిన ఘటన మహేష్ బాబు సొంతం. తన సహనటి నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ దాంపత్య జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఈ దంపతులకు గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు జన్మించారు.

ఇందులో గౌతమ్ పెద్దగా బయట కనబడడు కానీ, సితార సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. మరోవైపు మహేష్ కూడా సితారను మీడియా ముందు ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ పేద విద్యార్థిని కల సాకారం చేసి మంచి మనుసు చాటుకొని తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది సితార. వివరాల్లోకి వెళితే.. తండ్రి మహష్ బాబు అడుగు జాడల్లో నడుస్తుంది ఆయన ముద్దుల కూతురు సితార. గతంలో తాను నటించిన యాడ్ డబ్బులు మొత్తం చారిటీకి ఇచ్చ్చేసిన వైనం అందరికీ తెలిసినదే. ఇక తాజాగా ఓ నిరుపేద విద్యార్థిని కల నెరవేర్చి మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా సితార మెడిసన్ చదవాలనుకున్న ఓ పేద విద్యార్థినికి సాయం చేసి ఆమె కల సాకారం చేసింది.

ఇక తన కూతురు చేసిన మంచి పని గురించి తల్లి నమ్రత శిరోద్కర్ తన ఇన్ స్ట్రా వేదికగా ఆ వార్తని పంచుకుంది. వాస్తవానికి నవ్య అనే అమ్మాయి NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి న్యవకు డాక్టర్ కావాలనే కోరిక. అందుకోసం కష్టపడి పోటీ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంది. అన్ని అర్హతలు ఉన్నా తనకు ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఆమెని వేధించాయి. ఈ విషయం తెలుసుకొని సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ రియాక్ట్ అయింది. నవ్యశ్రీ కి సాయం చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మెడిసన్ పూర్తయ్యే వారకు కాలేజీ, హాస్టల్ ఫీజు ఈ ఫౌండేషన్ అందిస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు ల్యాప్ లాప్, స్టెతస్కోప్ ని బహుమతిగా ఇచ్చింది.. సితార. ఈ విషయాన్నే నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: